మాడుగుల రూరల్: మండలంలో కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన అనపగడ్డ సత్యనారాయణ అలియాస్ నానాజీ (39) కడుపు నొప్పి తాళలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ పి. దామోదర్‌నాయుడు వివరాల ప్రకారం... గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సత్యనారాయణ తన ఇంట్లో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడు భార్య వెంకట దుర్గా రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.