
పట్టిచ్చిన వారికి రూ.50 వేల బహుమతి
అనకాపల్లి: నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. రాంబిల్లి మండలంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ పాత, ప్రస్తుత ఫొటోలు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిసినవారు డయల్ 100, 112 నంబర్లతో పాటు 9440796084, 9440796108, 9440904229, 7382625531 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. హత్య జరగడానికి ముందు దుస్తులు, హత్య జరిగిన తరువాత వేసుకున్న చొక్కా రంగు వివరాలు కూడా వాల్ పోస్టర్లపై ముద్రించారు. నిందితుడి కోసం 12 బృందాలను ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు హత్యకు ముందు..తరువాత నిందితుడు బట్టలు మార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశాఖపట్నం జైలులో ఉన్న సమయంలో ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలోనూ పోలీసు బృందాలు విచారణ చేస్తున్నాయి.