
● అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు
మాడుగుల : ఈ నెల 3వ తేదీన మైనర్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడని, గ్రామానికి చెందిన డి.చిన్నపై ఆమె కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదు మేరకు 5వ తేదీన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అనకాపల్లి డీఎస్పీ వి. సుబ్బరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. కాగా ఈ విషయమై అదే రోజు సాయంకాలం కొంత మంది యువకులు గొడవకు దిగారని, ఆ గొడవలో నిందితుడు దిమిలి చిన్నతో పాటు గుణసాయిలు, బి. శ్రీనును కత్తెర లాంటి ఆయుధంతో స్వల్పంగా గాయపరిచారని మరో ఫిర్యాదు అందిందన్నారు. కాగా తగాదాను విడిపించడానికి వెళితే తనను అక్రమంగా కేసులో ఇరికించారని, మనస్తాపం చెందిన గుణసాయి తన ఇంట్లో ఉన్న చీమల మందు తాగి ఈ నెల 9వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ప్రస్తుతం గుణసాయి ఎన్‌టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను డిశ్చార్జి అయిన వెంటనే పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐ తాతారావు, ఎస్‌ఐ దామోదర నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment