
మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యం
పాయకరావుపేట: తాండవ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్‌ఐ బి.జోగారావు తెలిపారు. రైల్వే ట్రాక్ కిందన ఒడ్డుకి 10 అడుగుల దూరంలో మృతదేహం ఉందన్నారు. రైలులో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తుజారి నదిలో పడివుండవచ్చని చెప్పారు. గుర్తుపట్టేందుకు వీలులేకుండా మృతదేహం ఉందని తెలిపారు. మృతుడు నలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ నెక్ బనియన్, నలుపురంగు జీన్‌ప్యాంట్ ధరించి ఉన్నట్టు చెప్పారు. మృతుని వద్ద కై నీ ప్యాకెట్టు, రూ.670 నగదు ఉన్నాయని, స్థానిక వీఆర్‌వో వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.