
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా ద్వారంపూడికి బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం, వీడ్కోలు పలికిన వారిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర, జిల్లా కలెక్టర్ డా ఎ. మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ ఎ.రవి శంకర్, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లే అనురాధ, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఉన్నారు. ముఖ్యమంత్రి 2.28 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు పయనమయ్యారు. ముఖ్యమంత్రి వెంట విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తదితరులు ఉన్నారు.