
సిద్ధమవుతున్న 30 అడుగుల భారీ వినాయక విగ్రహం
● 30 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు
రావికమతం: ఈ ఏడాది వినాయక చవితి పండగ రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి ప్రత్యేకం కానుంది. ముందెన్నడూ లేని విధంగా గ్రా మంలో 30 అడు గుల భారీ వినా యక విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. గడచిన కొన్నేళ్లుగా వినాయక నవరాత్రి మహోత్సవాలను ఏటా ఘనంగా నిర్వహించే స్థానిక శివాలయం వీధి సిద్ధి వినాయక యూత్ కుర్రాళ్లు.. ఈ ఏడాది భారీ విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశా రు. ఇప్పటికే అన్ని హంగులు పూర్త య్యాయి. కోల్‌కతా నుంచి నలుగురు కళాకారులు వచ్చారు. కొత్తకోటకు చెందిన విగ్రహ శిల్పి నక్కా రాజు వారి సహాయంతో రెండు నెలలుగా ఈ విగ్రహం తయారు చేస్తున్నారు. 95 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని తెలిపారు.