
నవీన్ మృతదేహం
కోటవురట్ల: తాపీ పనిచేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి యారం నవీన్(45) మృతి చెందాడు. మృతుడి భార్య యారం అప్పలనర్శ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామానికి చెందిన నవీన్ తాపీ పనిచేస్తూ జీవన సాగిస్తున్నాడు. రాజుపేటలో మొల్లేటి వెంకటరమణ ఇంటి వద్ద తాపీ పనిచేస్తుండగా భవనం పరంజాపై నుంచి ప్రమాదశాత్తు జారిపడ్డాడు. పక్కనే విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే భవన యజమాని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి అతడి భార్య అప్పలనర్శకు సమాచారం ఇచ్చాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే నవీన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నవీన్ (ఫైల్)