
ఎంపికై న క్రీడాకారులతో కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ
యలమంచిలి: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు యలమంచిలి పట్టణానికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికై నట్టు కోచ్ నగిరెడ్డి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలకు యు.జయశ్రీ, రొట్ట పల్లవి, ఎల్. లహరి పాల్గొంటారన్నారు. గతేడాది డిసెంబరులో వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారన్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు డెహ్రడూన్‌లో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే సీనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో గొల్లవిల్లి విజయ్‌కుమార్, తుంపాల శ్వేత పాల్గొననున్నారని తెలిపారు. వీరు ఫిబ్రవరిలో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించి ఈ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఏపీ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అచ్చుతరెడ్డి, సహాయ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, కోశాధికారి బి.అర్జునరావు, ఉపాధ్యాక్షుడు ములంపాక అచ్చంనాయుడు అభినంధించారు.