పలు చోరీలతో సంబంధమున్న మహిళ అరెస్టు

డీఎస్పీ సుబ్బరాజు  - Sakshi

అనకాపల్లి టౌన్‌: స్థానిక జాతీయ రహదారి సుంకరమెట్ట కూడలి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న విజయనగరం జిల్లా వెంకటరామ మండలం పిట్టాడ గ్రామానికి చెందిన గొల్లి మౌనిక(27)ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుబ్బరాజు చెప్పారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి విలేకరులతో ఆయన మాట్లాడారు. గతనెల 26న ఉడ్‌పేటకు చెందిన నామా మాణిక్యమ్మ మండలంలో తుమ్మపాల యూనియన్‌ బ్యాంకుకు ఆటోలో వెళ్తుండగా అదే ఆటోలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ 32.3 గ్రాముల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైనట్లు బాఽధితురాలు పట్టణ పోలీసులు ఆశ్రయించింది. ఈమేరకు సీఐ దాడి మోహనరావు కేసు నమోదు చేసిన నేపథ్యంలో మౌనిక పలు చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. మే 22న వడ్డాది నుంచి బంగారుమెట్టకు వెళ్తున్న ఆటోలో చింతాడ వరలక్ష్మి మెడలో నుంచి 56.3 గ్రాముల బంగారం తాడు చోరీకి గురైనట్లు బుచ్చెయ్యపేట పోలీసులను ఆశ్రయించింది. గత నెల 26న చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నారాయణపేటకు ఆటోలో వెళ్తున్న సుంకర చిలుకమ్మ బ్యాగు నుంచి 58 గ్రాముల వెండి, 4.6 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు అదేరోజు చోడవరం పోలీసులను ఆశ్రయించింది. పై చోరీలకు పాల్పడినట్లు మౌనిక అంగీకరించిందని డీఎస్పీ చెప్పారు. ఈ మేరకు మౌనిక నుంచి 93 గ్రాముల బంగారం, 58 గ్రాముల వెండిని స్వాధీనపరుచుకుని శుక్రవారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారని డీఎస్పీ తెలిపారు. మౌనిక తనతో మైనర్‌ బాలుడిని వెంటపెట్టుకుని తిరిగేదని డీఎస్పీ పేర్కొన్నారు.

93 గ్రాముల బంగారం, 58 గ్రాముల వెండి స్వాఽధీనం

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top