
కేజీహెచ్‌లో అప్పలాచారికి పింఛన్ అందిస్తున్న వలంటీరు
రావికమతం: కేజీహెచ్‌లో చినతల్లికి పింఛన్ అందిస్తున్న వలంటీరు
రావికమతం/నర్సీపట్నం/కె.కోటపాడు: గ్రామ వలంటీర్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. విధి నిర్వహణలో సేవా దృక్పథంతో వ్యవహరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన పూడి చినతల్లి అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ వలంటీరు మంజేటి లోవకుమార్ శుక్రవారం అక్కడకు వెళ్లి పింఛన్ అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన జి.అప్పలాచారికి వలంటీర్ జి.రాజి పింఛన్ నగదు అందించింది. వలంటీర్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల శివాజీరాజు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్ అభినందించారు. నర్సీపట్నం మండలం యరకన్నపాలెం గ్రామానికి చెందిన భీమిరెడ్డి చిన్నబ్బాయి అనారోగ్యంతో పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కష్టంలో ఉన్న చిన్నబ్బాయికి ఆర్థిక తోడ్పాటును అందించాలనే సంకల్పంతో గ్రామ వలంటీర్ ఆదిలక్ష్మి, గృహసారధి దేముడు అక్కడకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు.
