అచ్యుతాపురం(అనకాపల్లి) : మైనర్ బాలికను మాయమాటలు చెప్పి తీసుకుపోయిన యువకుడిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసినట్టు పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ శుక్రవారం మీడియాకు తెలిపారు. డీఎస్పీ అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక అదృశ్యమైనట్లు బాలిక తల్లిదండ్రులు ఏప్రిల్ 11న స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో అదే గ్రామానికి చెందిన సుంక రమేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. రమేష్‌పై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.