
మాట్లాడుతున్న ఆర్డీవో చిన్నికృష్ణ
రాంబిల్లి : నేవీ పనులకు ఆటంకం కల్గించకుండా సహకరించాలని ఆర్డీవో చిన్నికృష్ణ కోరారు. చినకలవలాపల్లిలో శుక్రవారం ఆయన పర్యటించారు. సామాజిక అటవీశాఖ భూములను రక్షణ శాఖకు అప్పగించారు. దీంతో నేవీ ప్రహరీ నిర్మాణం, ఇతర పనులు చేపట్టింది. గతంలో ఈ స్థలాల్లో వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేసి మొక్కల్ని పెంచుకున్నామని, వాటికి పరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. దీనిపై ఆర్డీవో స్పందిస్తూ పరిహారం విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యవతి, ఎస్‌ఐ దీనబంధు, ఆర్‌ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.