● ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిపాంగి జీవన్ కృష్ణ
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలను రద్దుచేసే కుట్రలకు పాల్పడితే సహించేది లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం స్ధానిక గిరిజన్ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన్యంలో ఉన్నటువంటి గిరిజనులంతా ఏకతాటిపై పార్టీల కతీతంగా గిరిజన చట్టాలను రక్షించుకోవడానికి పోరాటం చేయాలన్నారు. గిరిజన హక్కులు భూములు, రాజ్యాంగ పరిరక్షణకు కోసం రూపొందించిన ఈ చట్టాలను బలహీనపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. పార్టీలు అనుబంధాలను పక్కన పెట్టి గిరిజనలందరూ ఐక్యంగా ఉండాలని, ఆదివాసీ చట్టాలు అమలు, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఏకంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల గిరిజన సంఘం కార్యదర్శి సాగిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


