సాక్షి,పాడేరు: ఏజెన్సీలో బాకై ్సట్ తవ్వకాల జోలికి కూటమి ప్రభుత్వం వస్తే ఉపేక్షించేది లేదని, గిరిజనుల హక్కుల కోసం పదవిని త్యాగం చేయడానికై నా, ప్రాణాలను పణంగా పెట్టడానికై నా సిద్ధమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసేలా బాకై ్సట్‌కు అనుకూలంగా జీవో నంబరు 97ను జారీ చేస్తే, అప్పట్లో మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. చింతపల్లిలో గిరిజనులతో కలిసి నిర్వహించిన బాకై ్సట్ వ్యతిరేక సదస్సులో జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల పక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు. ఆ సభలో అప్పటి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. బాకై ్సట్ జోలికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరుకుతా.. అని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేడు అదే టీడీపీ కండువా కప్పుకుని, కూటమి ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలకు వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆమెను ప్రజలు రెండుసార్లు ఓడించినా బుద్ధి రాలేదని, ఇప్పుడు బాకై ్సట్ సర్వేపై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగనన్నే గిరిజనుల రక్షకుడు
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆ జీవోను రద్దు చేసి చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. గిరిజనుల రక్షకుడిగా జగనన్న పేరు పొందారన్నారు. గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాంతంలో బాకై ్సట్ సర్వే కోసం వెళ్తున్న బృందాన్ని గురువారం గిరిజనులు అడ్డుకున్నారని, అధికారులే గిరిజనులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిని నమ్ముకున్న గిరిజనులను అడవికి దూరం చేసే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదని, బాకై ్సట్ తవ్వకాలకు పూనుకుంటే గిరిజన తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇటీవల పాడేరు కలెక్టరేట్ ముట్టడితో గిరిజనులు తమ సత్తా చాటారని, బాకై ్సట్ విషయంలో కూడా అదే తరహాలో మహోన్నత ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. గిరిజనుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర,ఎస్టీసెల్ పాడేరు నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ పాల్గొన్నారు.
బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీ
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): ఏజెన్సీలో బాకై ్సట్ జోలికి వస్తే ఉపేక్షించేది లేదని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స హెచ్చరించారు. శుక్రవారం అరకులోయ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గూడెంకొత్తవీధి మండలం జర్రెల ప్రాంతంలో రహస్యంగా సాగిస్తున్న బాకై ్సట్ సర్వేలను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి, చీకటి ఒప్పందాలతో బాకై ్సట్ తవ్వకాలకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అప్పలనర్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను, చట్టాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే గిరిజన చట్టాలకు తూట్లు పొడవడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ్క కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాలదేవ్, ధర్మనపడాల్, నాయకులు బాబుజ్జిబాబు, సూర్యనారాయణ, బాలయ్య, జగన్నాథం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పదవి, ప్రాణత్యాగాలకు సిద్ధం
చంద్రబాబు తలతీస్తానన్న
గిడ్డి ఈశ్వరి వైఖరి ఏమిటో?
పాడేరు ఎమ్మెల్యే
మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం


