పరవాడ: కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలాఅండగా ఉంటుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. ముత్యాలమ్మపాలెంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార భరోసా నగదు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున అందించారు. అనంతరం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం గ్రామాల్లో సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించిన వారికి చెరో రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి బాధిత కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపల వేట నిషేధ సమయంలో గంగపుత్రులను ఆదుకోనేందుకు ఈ నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 960 మంది మత్స్యకారులకు రూ.1.92 కోట్లు, యలమంచిలి నియోజకవర్గంలో 4,352 మందికి రూ.8.7 కోట్లు, పాయకరావుపేట నియోజకవర్గంలో 8,349 మందికి రూ.16.69 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు విజయ్, మత్స్యకార సంస్థ డెవలప్‌మెంట్ అధికారి రవితేజ, పరవాడ ఇన్‌చార్జ్ తహసీల్దార్ అరుణ్, ముత్యాలమ్మపాలెం ప్రత్యేక అధికారి రమాదేవి, పరవాడ మాజీ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు, మాజీ సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీటీసీలు అరిజిల్లి దేవి రవి, సూరాడ బంగార్రాజు, తిక్కవానిపాలెం మాజీ సర్పంచ్ చేపల మసేను, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ బి.అప్పారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


