నక్కపల్లి : మండలంలో రాజయ్యపేటగ్రామంలో జరుగుతున్న ఉపాధి హమీ పథకం పనుల్లో వీఆర్‌పి మైలపల్లి సత్యనారాయణ బినామీ మస్తర్లు వేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటూ మంగళవారం గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 70 గ్రూపులు ఉన్నాయన్నారు. 70 మంది మేట్లు పనిచేస్తున్నారన్నారు. వీఆర్‌పి సత్యనారాయణ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి జూమ్‌కాల్‌ద్వారా మస్తర్లు వేస్తున్నాడన్నారు. పనుల్లోకి రాని వారికి సైతం మస్తర్లు వేసి స్థానికంగా ఉన్న కూలీలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. వీఆర్వో చేస్తున్న అక్రమాల వల్ల గ్రామంలో 1400 మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించడం లేదన్నారు. పనుల్లోకి రానివారిని ఆన్‌లైన్ విధానంలో మస్తర్లు వేసి అసలైన కూలీలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. తక్షణమే వీఆర్పీ ఆక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పిక్కి కోదండరావు, బొంది గురన్న,పిక్కిచిన్నారి, పిక్కి కిరణ్ పిక్కికోటేశ్వరరావు, ఎరిపల్లి అమ్మోరియ్య, పిక్కిరమణ,కాశీరావు,తదితరులు మంగళవారం ఇన్‌చార్జ్ ఎంపీడీవో సీతారామరాజుకు ఫిర్యాదు అందజేశారు.


