చింతపల్లి: లంబసింగి పరిసర గ్రామ గిరిజనులకు అవసరమైన సోలార్ పంపు సెట్‌లు, వాటర్ వీల్స్‌ను స్థానిక పాఠశాల ఆవరణలో శనివారం ఎస్‌ఎన్‌ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రన్ మాట్లాడుతూ గిరిజనుల సౌకర్యార్థం తమ సంస్థ తరఫున 200 మందికి నడిపించుకుని తాగునీటిని తెచ్చుకొనే వీలర్స్, సోలార్ పంపు సెట్లు అందజేశామన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి.వి.రఘుపతి మాట్లాడుతూ గిరిజన రైతులు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు ఆనందదాయకంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌ఎఫ్ డైరెక్టర్ శశిప్రభ, సిబ్బంది హరిప్రసాద్, కాంతారావు, మధు, వంశీ, నర్సింగరావు పాల్గొన్నారు.


