గూడెంకొత్తవీధి: మండలంలో శనివారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యటించారు. గూడెంకొత్తవీధిలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఎంవీఐ సాయిరమేష్, సీఐ సుధాకర్‌కు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వాహన చోదకులపై కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. గూడెంకొత్తవీధిలో ఏ, బీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు.
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను స్ధానిక ఏఎస్‌పీ నవజ్యోతి మిశ్రా పరిశీలించారు. మాస్ కాపియింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ వీరబాబు, వెంకటరమణ, ఎంఈవో ప్రసాద్ పాల్గొన్నారు.


