● అబ్బురం..పూల వికాసం
ప్రకృతి ఒడిలో దాడి ఉన్న అందాలకు చింతపల్లి చిరునామా..మంచు దుప్పటి కప్పుకున్న మన్యం కొండల్లో ఇప్పుడు సరికొత్త రంగులు అద్దాయి. ఏంజిల్స్ ట్రంపెట్ (స్వర్గపు) పువ్వులు ఆకాశం నుంచి దేవదూతలు భూవికి పంపిన బాజాల వలె, గాలికి ఊగుతూ ఇవి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పెద్ద పెద్ద గంటల ఆకృతిలో గులాబీ, తెలుపు రంగుల కలయికతో కొమ్మ కొమ్మకూ వేలాడుతూ ఉమ్మెత్తను పోలిన ఈ పూలు కనువిందు చేస్తున్నాయి. వీటిని చెట్టు ఉమ్మెత్త అని కూడా స్థానికంగా పిలుస్తుంటారు. శీతాకాలపు చలిలో, చింతపల్లి పరిసర ప్రాంతాల్లో విరబూసిన ఈ పూల సోయగం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. మన్యం అందాలను తిలకించడానికి వచ్చే వారికి ఈ ఏంజిల్స్ ట్రంపెట్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. – చింతపల్లి


