ఔషధ మొక్కల పరిశీలన
● గాలికొండ, సుంకరమెట్ట ప్రాంతాలను సందర్శించిన కర్ణాటక విద్యార్థులు
అరకులోయ టౌన్: మండలంలోని గాలికొండ, సుంకరమెట్ట, అనంతగిరి అటవీ ప్రాంతాల్లోని ఔషధ మొక్కలను కర్ణాటకకు చెందిన బాగాల్‌కోట్‌లోని బీవీవీఎస్ అక్కమహాదేవి మహిళా కళాశాల ఎంఎస్సీ విద్యార్థులు శుక్రవారం పరిశీలించారు. బొటానికల్ టూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చిన వారు వాటి వివరాలను సేకరించారు. ఆంధ్రా యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగం బొటానికల్ టూర్ రిసోర్స్ పర్సన్, మొక్కల వర్గీకరణ నిపుణుడు డాక్టర్ జె. ప్రకాష్‌రావు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించి పోతున్నా అనేక జాతులకు చెందిన ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నయన్నారు. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. అధ్యాపకులు డాక్టర్ అనిత మారిహాల్, వీణా పోలీస్ పాటిల్, ఎం. వందన తదితరులు పాల్గొన్నారు.


