రుణాలు సద్వినియోగం చేసుకోండి
● ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ
● స్వయం సంఘాల సభ్యులకురుణాల పంపిణీ
పాడేరు : స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జి.మాడుగుల మండలానికి చెందిన 36 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు రూ.2కోట్ల 50లక్షల విలువైన బ్యాంకు రుణాల చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో అంబెడ్కర్, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళి పాల్గొన్నారు.


