పల్స్ పోలియోకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
రంపచోడవరం: ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానిక ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో రంపచోడవరం, చింతూరు డివిజన్ల వైద్యాధికారులు, సీహెచ్‌వోలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు 0–5 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో 11 మండలాల్లో 29 పీహెచ్‌సీల పరిధిలో 18,164 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు 32,560 డోసుల 1,525 వైల్స్ సిద్ధం చేసినట్టు చెప్పారు. 591 బూత్‌లు, 75 రూట్లు, 28 మొబైల్ టీములు , 8 పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, బస్‌స్టాండ్‌లు, జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసి, విజయవంతం చేసే విధంగా అధికారులు , సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశంచారు. 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కులు వేసిందీ లేనిది నిర్థారణ చేసుకొని నూరుశాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్ సరిత, డాక్టర్ జాన్సన్,ప్రసన్న, దత్త తదితరులు పాల్గొన్నారు.


