రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
డుంబ్రిగుడ: మండలంలలోని పంతలచింత సమీపంలో జాతీయ రహదారి మలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హుకుంపేట మండల రంగశీల పంచాయతీ ఇరుకువలస గ్రామానికి చెందిన కొర్ర మధు స్వగ్రామం నుంచి అరకులోయ వైపు బైక్‌పై స్నేహితుడితో కలిసి వస్తుండగా పంతలచింత జాతీయ రహదారి మలుపులో గుర్తు తెలియని కారు బలంగా ఢీకొంది. దీంతో మధు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వాహనంలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.


