వెన్నులో వణుకు పుట్టిస్తున్నా..
ముంచంగిపుట్టు: మంచు తెరలు వారి కంటిచూపును అడ్డుకున్నా గిరిజనుల నిత్య కృత్యాలను మాత్రం ఆపలేవు. ప్రకృతి సృష్టించిన కఠినమైన చలిని కూడా వారు లెక్కచేయకుడా తమ దైనందన కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మత్స్యగెడ్డను మంచు కమ్మేయడంతో ఇబ్బందులు పడుతూ పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇబ్బందులు పడుతూనే మంట నూర్పిడి పనుల్లో గిరి రైతులు పాల్గొంటున్నారు. చలి మంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు. మంచు తెరలు కమ్మేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు.
వెన్నులో వణుకు పుట్టిస్తున్నా..
వెన్నులో వణుకు పుట్టిస్తున్నా..


