ఓజుబంద క్వారీని మూసివేయాలి
ఐటీడీఏ ఎదుట గిరిజనుల నిరసన
రంపచోడవరం: ఓజుబందలోని నల్లరాయి క్వారీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. గంగవరం మండలం ఓజుబంద నల్లరాయి క్వారీని తక్షణమే మూసివేయాని కోరారు. దిరిసినపల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవానీ కుటుంబాన్ని వెలివేసిన సంఘటనపై ఇప్పటికే పలుమార్లు అర్జీలు అందజేసినప్పటికీ విచారణ జరపకుండా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చోడి ప్రదీప్‌కుమార్‌దొర, ప్రసాద్ కంగాల అబ్బాయిదొర పాల్గొన్నారు.


