జిల్లా సైక్లింగ్ అంబాసిడర్‌గా అజయ్
సాక్షి, పాడేరు: చలి ఉత్సవాల్లో నిర్వహించిన 36 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం పొందిన గిరిజన విద్యార్థి పి.అజయ్‌ను జిల్లా సైక్లింగ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. గుమ్మకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న అజయ్,అతని తండ్రి లైభన్‌ను సోమవారం కలెక్టర్ అభినందించారు.మౌంటెన్ ట్రయల్ బైక్ కొనుగోలుకు కలెక్టర్ ఆర్థిక సాయం అందజేశారు.జిల్లాలోని కొత్త ట్రైల్ రూట్స్,ట్రాక్స్‌ను బయట ప్రపంచానికి తెలియజేయాలని,పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలని అజయ్‌కు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అడ్వెంచర్ ఔత్సాహిక విద్యార్థి బాటం తేజేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆర్ధిక సాయం అందజేత


