వైఎస్సార్ సీపీలోకి ఆర్.కొత్తూరు ఉప సర్పంచ్
కొయ్యూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతోందని పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు అన్నారు. టీడీపీ నేత, ఆర్.కొత్తూరు ఉప సర్పంచ్ అంకంరెడ్డి అప్పలనాయుడు టీడీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పలనాయుడుకు పార్టీ కండువా వేసి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకలాపాలు, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలు నచ్చి పార్టీలో చేరినట్టు చెప్పారు.


