కరాటేలో గిరిజన యువకుల ప్రతిభ
ముంచంగిపుట్టు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 14న జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో గిరిజన యువకులు ప్రతిభ కనబరిచారు. బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ కె.సురేష్ ఆధ్వర్యంలో గిరిజన యువకులు పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టు గ్రామానికి చెందిన రుంజుల సూర్యప్రకాశ్ బ్లాక్ బెల్ట్ సీనియర్ 55 కేజీల విభాగంలో కట అండ్ స్పారింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. పెదబయలు మండలం జామిగూడ గ్రామానికి చెందిన కిల్లో సతీష్‌కుమార్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2లో ఆరో తరగతి చదువుతున్నాడు. 35 కేజీల జూనియర్ విభాగంలో కటలోని స్విలర్ మెడల్, స్పారింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. పాడేరు మండల కేంద్రానికి చెందిన సల్లంగి వెంకటప్రసాద్ 55 కేజీల సీనియర్ బ్రౌన్ బెల్ట్ విభాగంలో కట భాగంలో గోల్డ్ మెడల్‌తో పాటు స్పారింగ్‌లో అత్యున్నత ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు.


