శ్రమదానంతో బి.సింగవరానికి రోడ్డు
కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ బి.సింగవరం గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. బూదరాళ్లకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండపై సింగవరం గ్రామం ఉంది. దీనికి అసలు రహదారి సౌకర్యం లేదు. రహదారి వేయాలని ఇది వరకు అనేకసార్లు అధికారులకు వినతులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు సోమవారం గుణపం, పారా పట్టుకున్నారు. కొండను తవ్వి రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు.


