విద్యుత్ పొదుపుపై విస్తృతంగా ప్రచారం
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి, పాడేరు: విద్యుత్ పొదుపుపై గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఆదేశించారు. ఇంధన పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్లను కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించి, ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా విద్యుత్ పొదుపుపై అవగాహన ఏర్పర్చుకోవాలని తెలిపారు.అనంతరం కలెక్టరేట్ నుంచి పాతబస్టాండ్ అంబేడ్కర్ సెంటర్ వరకు ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌ఈ జి.ఎస్.ప్రసాద్, ఈఈ ఎల్.సి.హెచ్.పాత్రుడు, పాడేరు డీఈఈ వేణుగోపాల్, ఏవో శ్యామలరావు, పీవో కిరణ్‌కుమార్, కమర్షియల్ ఏడీ భాస్కరరావు, పాడేరు, చింతపల్లి, అరకులోయ ఆపరేషన్ ఏడీఈలు ప్రసాద్, రాంబాబు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
భవితరాల కోసం విద్యుత్ ఆదా చేయాలి
రంపచోడవరం: భావితరాల వారికి భరోసానిచ్చే విధంగా ప్రతి ఇంట్లో విద్యుత్ ఆదా చేయాలని స్థానిక ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ అన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో సోమవారం ఇంధన పరిరక్షణ ర్యాలీని పీవో, సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ‘నేటి సంకల్పం రేపటి వెలుగుల సాకారం’ అనే కార్యక్రమం ద్వారా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ప్రతి ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలని చెప్పారు. విద్యుత్‌ను ఆదా చేసే ఎలక్ట్రికల్ సామగ్రిని వినియోగించాలని సూచించారు. ఈ నెల 14నుంచి 20వ తేదీ వరకు ఏడు రోజులపాటు ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 18న రంపచోడవరం అంబేడ్కర్ సెంటర్‌లో కళాజాత నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యార్థులకు విద్యుత్ ఆదాపై అవగాహన క ల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీడీ రుక్మాండయ్య, డీడీవో కె.కోటేశ్వరరావు, ఏపీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుపై విస్తృతంగా ప్రచారం


