మాడగడ పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
అరకులోయటౌన్: మండలంలోని మాడగడ పీహెచ్‌సీని అరకులోయ జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం 4 గంటలకు పీహెచ్‌సీని తనిఖీ చేసిన సమయంలో మేల్ నర్సింగ్ ఆర్డర్ కొర్రా భీమా మాత్రమే విధుల్లో ఉన్నారు. పీహెచ్‌సీలోని డాక్టర్ గది, మందుల గదులు, వార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్‌సీలో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో జెడ్పీటీసీ విస్తుపోయారు. మేల్ నర్సింగ్ ఆర్డర్‌తో మాట్లాడి డాక్టర్‌తో పాటు సిబ్బంది విధులకు హాజరు, సమయపాలనపై ఆరా తీశారు. తాను మధ్యాహ్నం 2 గంటలకు పీహెచ్‌సీకి వచ్చినప్పటికి డాక్టర్ వసంత విధుల్లో లేరని, మిగతా స్టాఫ్ కూడా 4 గంటలకు ముందే వెళ్లిపోయారని భీమా తెలిపారు. దీంతో జెడ్పీటీసీ సభ్యురాలు రోషిణి పాడేరు డీఎం అండ్ హెచ్‌వో కృష్ణమూర్తి నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మాడగడ పీహెచ్‌సీ డాక్టర్ వసంత విధులకు సకాలంలో వెళ్లడం లేదని, సాయంత్రం వరకు ఆస్పత్రిలో ఉండడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పీహెచ్‌సీ తనిఖీని చేశానని, డాక్టర్ మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారన్నారు. దీనికి స్పందించిన డీఎంహెచ్‌వో.. డాక్టర్ వసంతపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ఇటీవల తాను మాడగడ పీహెచ్‌సీ తనిఖీకి వెళ్లిన స మయంలో ఆమె విధుల్లో లేరని చెప్పా రు. దీంతో డా క్టర్ వసంతపై శాఖా పరమై న చర్యలు తీ సుకోవాలని జెడ్పీటీసీ డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామమూర్తి, పాల్గొన్నారు.


