ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాల పంపిణీ
రంపచోడవరం: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు అందించేలా చర్యలు చేపడతామని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలువురు ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు చెవిటి మిషన్లు, వీల్ చైర్లు, త్రీ వీలర్ సైకిళ్లు అందజేస్తామన్నారు. ఏజెన్సీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎంత మంది ఉన్నారో జాబితా తయారు చేసి సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆర్‌ఎల్ శ్రీనివాసరావు, ఏఎంవో భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
కోల్డ్ స్టోరేజ్ కోసం పరిశీలన
పెదగెద్దాడ పీహెచ్‌సీలో పోలియో చుక్కల కోల్డ్ స్టోరేజీ పాయింట్ ఏర్పాటు కోసం సోమవారం పీవో స్మరణ్‌రాజ్ పరిశీలించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో త్వరలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపడతామన్నారు. ఏడీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సరిత, డాక్టర్ వినోద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాల పంపిణీ


