ముగిసిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు
రంపచోడవరం: రంపచోడవరం సమీపంలోని ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ముగిశాయి. క్రికెట్ పోటీలో చింతూరు మండలం విజేతగా నిలిచింది. రంపచోడవరం మండలం రన్నరప్‌గా నిలిచింది. మహిళ ఉపాధ్యాయుల త్రో బాల్ పోటీల్లో చింతూరు మండలం విజేతగా నిలవగా రన్నరప్‌గా దేవీపట్నం మండలం నిలిచింది. గెలుపొందిన జట్లకు బహుమతులు, సర్టిఫికెట్‌లు అందజేశారు. గెలుపొందిన జట్లు ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లా స్థాయిలో పాడేరులో జరిగి పోటీల్లో పాల్గొంటారని ఏఎంవో కొమ్మ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆర్‌ఎల్ శ్రీనివాసరావు, హెచ్‌ఎం బాలరాజు, రాంబాబు, ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా సెక్రటరీ కె భవానీ, కోఆర్డినేటర్ రవి, టెక్నికల్ అఫీషియల్స్ బి.సుదర్శన్, ధర్మరాజు, కృష్ణారావు, బాపన్నదొర, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు


