జెడ్పీ నిధులతో సామూహిక మరుగుదొడ్లు
ముంచంగిపుట్టు: జెడ్పీ నిధులతో సామూహిక మరుగుదొడ్లను నిర్మించనున్నట్టు జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. స్థానిక అంబేడ్కర్ పార్కులో రూ.5లక్షలు, గిరిజన భవన్ వద్ద రూ.5లక్షల వ్యయంతో చేపట్టిన సామూహిక మరుగుదొడ్లు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు అధికంగా నిధులు ఖర్చు చేసినట్టు తెలిపారు. ముంచంగిపుట్టులోని అంబేడ్కర్ పార్కును తీర్చిదిద్దేందుకు, గిరిజన భవన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుభాష్‌చంద్ర, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్‌సీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయిస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షుడు మోదకొండ, వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా, మండల నేతలు మూర్తి, రాజారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర


