ముగిసిన రోలర్ స్కేటింగ్ హాకీ సమరం
విశాఖ స్పోర్ట్స్: నగరంలో జరుగుతున్న జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సీనియర్ పురుషుల ఇన్‌లైన్ హాకీ ఫైనల్‌లో చండీగఢ్ 6–2 గోల్స్ తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. జూనియర్ బాలుర ఇన్‌లైన్ హాకీ ఫైనల్స్‌లో తమిళనాడు 6–5 గోల్స్ తేడాతో చండీగఢ్‌పై గెలుపొందింది. వీఎంఆర్డీఏ పార్కులో జరిగిన రోలర్ హాకీ సీనియర్ పురుషుల ఫైనల్‌లో హర్యానా జట్టు 4–2 గోల్స్‌తో హిమాచల్‌ప్రదేశ్‌పై విజయం సాధించింది. జూనియర్ బాలుర విభాగంలో చండీగఢ్ 2–0తో హర్యానాపై గెలిచి టైటిల్‌ను కై వసం చేసుకుంది.


