మాచ్‌ఖండ్‌ జిగేల్‌ | - | Sakshi
Sakshi News home page

మాచ్‌ఖండ్‌ జిగేల్‌

Dec 15 2025 8:50 AM | Updated on Dec 15 2025 8:50 AM

మాచ్‌

మాచ్‌ఖండ్‌ జిగేల్‌

అవాంతరాలను అధిగమించి పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పాదన

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం అవాంతరాలను అధిగమించింది. పూర్తిస్థాయి ఉత్పాదనతో దూసుకుపోతూ వెలుగులు

విరజిమ్ముతోంది. ఈ ప్రాజెక్ట్‌ అత్యంత పురాతనమైనది కావడంతో ఆరు యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేసిన సందర్భాలు తక్కువే. సాంకేతిక సమస్యలతో పనిచేయని రెండు, నాలుగు నంబర్ల జనరేటర్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అధికారులు, సిబ్బంది వినియోగంలోకి తెచ్చారు. ఇప్పుడు నిరాటంకంగా ఆరింటి ద్వారా 120 మెగావాట్ల్ల ఉత్పాదన జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా డుడుమ, జోలాపుట్టు ప్రాజెక్ట్‌ల్లో పూర్తిస్థాయిలో నీటినిల్వలు ఉన్నాయి.

ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన గాడిలో పడింది. కొంత కాలంగా తరచూ జనరేటర్లు మొరాయిస్తుండడంతో ప్రాజెక్టు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. దీనికితోడు జలాశయాల్లో నీటి సమస్యతో విద్యుత్‌ ఉత్పత్తికి నిత్యం ఆటంకం కలిగేది. ఈ ఏడాది ఆంధ్రా ఒడిశా సరిహద్దులో విస్తరంగా వర్షాలు పడటంతో జలాశయాల నీటి మట్టాలు ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయితో కళకళలాడుతున్నాయి.

● మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో ప్రాజెక్టు అధికారులు తీవ్రంగా శ్రమించి శతశాతం విద్యుత్‌ ఉత్పాదన కృషి చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. గత కొన్నేళ్లుగా తరచూ జనరేటర్లు మరమ్మతులకు గురవుతూ వచ్చాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది శ్రమిస్తూ ఉత్పాదనను మెరుగు పరుస్తూ వచ్చారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రాజెక్టులో శతశాతం విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

జలాశయాలు కళకళ

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి.

● డుడుమ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు. శనివారం నాటికి 2581,60 అడుగులుగా నమోదు అయింది.

● జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు. ప్రస్తుతం 2746.20 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజుకు 2745.75 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాదితో పోలిస్తే ఒక అడుగు మేర నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.

● మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో శతశాతం విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. తరచూ మరమ్మతులతో ఉండిపోయే 2,4వ నంబర్ల జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాజెక్టు, జెన్‌కో అధికారుల కృషి ఫలించింది. తొలుత 4వ నెంబరు జనరేటర్‌కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెచ్చారు. అనంతరం 2వ నంబరు జనరేటర్‌కు చెందిన ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో దీని మరమ్మత్తుల నిమిత్తం జెన్‌కో అధికారులు రూ. 40లక్షలు కేటాయించారు. వెంటనే రేయింబళ్లు శ్రమించి ఈ జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం 1,2,3,4,5,6 నంబర్ల జనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

కార్యరూపం దాల్చని ఆధునికీకరణ

గత కొన్నేళ్లుఆ మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఆధునికీకరణకు ఇరు రాష్ట్రాలు ప్రకటనలు చేస్తూ వస్తున్నాయి. పనులు మాత్రం మొదలు కావడంలేదు. అత్యంత పురాతన జలవిద్యుత్‌ కేంద్రం కావడంతో పూర్తిస్థాయి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేస్తే విద్యుత్‌ ఉత్పత్తి 150 మొగావాట్ల వరకు పెరిగే ఆస్కారం ఉంది. ఆదిశగా ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పలువురు సూచిస్తున్నారు.

డుడుమ, జోలాపుట్టులో పూర్తిస్థాయి నీటిమట్టాలు

వినియోగంలోకి అన్ని జనరేటర్లు

ఆరు యూనిట్లతో 120 మెగావాట్ల ఉత్పత్తి

ఫలించిన సిబ్బంది, అధికారుల కృషి

అందరి కృషి అభినందనీయం

డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో ప్రస్తుతం ఏడాదికి అవసరమైన నీటి నిల్వలు ఉండడం విద్యుత్‌ ఉత్పత్తికి నీటి సమస్య లేదు. రెండో నంబరు జనరేటర్‌కు రూ.40లక్షలతో మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చాం. ప్రసుత్తం ప్రాజెక్టులో అన్ని జనరేటర్లు పని చేస్తున్నాయి.120 మొగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. శతశాతం విద్యుత్‌ ఉత్పాదనకు ప్రాజెక్టు ఉద్యోగులు, సిబ్బంది కృషి అభినందనీయం.

– ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు,

ఎస్‌ఈ,మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం

మాచ్‌ఖండ్‌ జిగేల్‌ 1
1/3

మాచ్‌ఖండ్‌ జిగేల్‌

మాచ్‌ఖండ్‌ జిగేల్‌ 2
2/3

మాచ్‌ఖండ్‌ జిగేల్‌

మాచ్‌ఖండ్‌ జిగేల్‌ 3
3/3

మాచ్‌ఖండ్‌ జిగేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement