మురిసిన పర్యాటకం
సందర్శన ప్రాంతాలు కిటకిట భారీగా తరలివచ్చిన సందర్శకులు అటవీశాఖ, ఐటీడీఏలకు భారీగా ఆదాయం
పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండపై ఆదివారం పర్యాటకులు పోటెత్తడంతో అటవీశాఖకు భారీగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో 3,500 మంది సందర్శించగా రూ.2,24,550 ఆదాయం వచ్చింది.ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకుల రాకతో శనివారం సాయంత్రం నుంచి పాడేరు, వంజంగి కొండ దిగువ ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఈ మార్గం వాహనాలతో కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేందరం ఆంధ్రా ఊటీ అరకులోయకు ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్‌కు తెల్లవారుజాము నాలుగు గంటలకు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ప్రకృతి అందాలను తిలకించారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. గిరిజనుల వస్త్రధారణలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజయం పర్యాటకులతో కిటకిటలాడాయి.
ముంచంగిపుట్టు: ఆంద్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం డుడుమ జలపాతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.పెద్ద సంఖ్యలో కుటుంబాలతో విచ్చేశారు. డుడుమ జలపాతం, జోలాపుట్టు జలాశయం, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, దేసిమా మ్యూజియం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
చింతపల్లి: మండలంలోని పర్యాటక కేంద్రాలు కళకళలాడాయి. లంబసింగి, చెరువులవేనం, తాజంగి ప్రాంతాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. మంచు అందాలను తిలకించారు.
డుంబ్రిగుడ: మండలంలోని చాపరాయి జలవిహారి, అరకు పైనరీకి ఆదివారం భారీగా సందర్శకులు తరలివచ్చారు. జలవిహారి వద్ద స్నానాలు చేస్తూ సందడి చేశారు. చాపరాయిని గత శనివారం రూ.1,13,010, ఆదివారం రూ.1,73,040 చొప్పున మొత్తం రూ.1,73,040, ఈ శని, ఆదివారాల్లో రూ.2,74,320లు టికెట్ రూపంలో పాడేరు ఐటీడీఏకు ఆదాయం సమకూరింది. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరకు పైనరీకి శని, ఆదివారాల్లో రూ.2 లక్షల ఆదాయం వచ్చింది.
హుకుంపేట: ఉత్తరాంధ్రలో ఎత్తయిన శిఖరంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతం సీతమ్మతల్లి జెండాకొండ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. సూర్యోదయం అందాలను తిలకించారు.
డుడుమ జలపాతం
సందర్శనకు తరలివచ్చిన
మురిసిన పర్యాటకం
మురిసిన పర్యాటకం
మురిసిన పర్యాటకం
మురిసిన పర్యాటకం
మురిసిన పర్యాటకం
మురిసిన పర్యాటకం


