ఇస్కాన్‌లో మార్మోగిన హరి నామస్మరణ
● విశాఖలో శ్రీలీల
విశాఖ నగరంలో ఆదివారం శ్రీలీల సందడి చేసింది. సింహాచలంలో అప్పన్న స్వామిని ద ర్శించుకుంది. అనంతరం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.
కొమ్మాది (విశాఖ): హరే కృష్ణ, హరేరామ నామస్మరణతో సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఆదివారం మార్మోగింది. వారాంతపు పూజల సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభూజీ, మాతాజీ నితా యి సేవిని భగ వద్గీత శ్లోకాలను ఆలపించి, ప్రవచనాలు ఇచ్చారు. రాధాకృష్ణులు, సుభద్ర, బలభద్ర జగన్నాథుడు, సీతారాములు, ఆంజనేయ, నరసింహస్వామి విగ్రహాలను వివిధ వర్ణాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఇస్కాన్‌లో మార్మోగిన హరి నామస్మరణ


