సీపీఆర్‌తో ప్రాణదానం
చింతూరు: గుండెపోటు వచ్చిన సమయంలో సీపీఆర్ చేయడం ద్వారా అత్యవసర సమయంలో రోగికి ప్రాణదానం లభించే అవకాశముంటుందని ఆరోగ్యభారతి రాష్ట్ర అధ్యక్షుడు, జీఎస్‌ఎల్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీ విద్యార్థినులకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అత్యవసర సమయాల్లో ప్రథమచికిత్స ఎంతో అవసరమని, ప్రతిఒక్కరూ ఆరోగ్య జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యభారతి కార్యదర్శి డాక్టర్ నారాయణ, స్థానిక సేవాభారతి వైద్యుడు గంగాధరప్రసాద్ పాల్గొన్నారు.


