పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాడేరు రూరల్: స్థానిక ప్రభుత్వ పొలిటెక్నిక్ కళాశాల 1984– 2022 బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.ఇక నుంచి ఏటా ఇదే మాదిరిగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కళాశాలకు సహాయ సహకారాలు అందించాలని వారు నిర్ణయించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరిబాబు, అధ్యాపక సిబ్బందిని వారు ఘనంగా సత్కరించారు.


