ప్రశాంతంగా నవోదయ రాత పరీక్ష
పాడేరు : జవహర్ నవోదయలో ప్రవేశాలకు శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కొమ్మాది, విశాఖపట్నం, ఎటపాక జవహర్ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పాడేరు డివిజన్‌లో ఆరు, రంపచోడవరంలో నాలుగు, చింతూరు డివిజన్‌లో మూడు పరీక్ష కేంద్రాల్లో 2589 మంది విద్యార్థులకు గాను 1517 మంది హాజరయ్యారు. పాడేరు పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల, సీఏహెచ్ పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తనిఖీ చేశారు.
కొమ్మాది (విశాఖ): జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ వైఎస్‌ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 37 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 8,276 మంది దరఖాస్తు చేసుకోగా 5,619 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 2,657 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.


