సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం
● మూడో నంబర్ యూనిట్‌లో
నిలిచిన ఉత్పాదన
సీలేరు: ఏపీజెన్‌కో స్థానిక జలవిద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్‌లో గురువారం సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ యూనిట్‌లో ఉత్పాదనను అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న జెన్‌కో డీఈ రాజేంద్రప్రసాద్ మూడో యూనిట్‌ను పరిశీలించారు. తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఇంజినీర్లు, సిబ్బంది ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. యూనిట్‌కు చెందిన గవర్నర్లో మెకానికల్ సమస్యను గుర్తించిన అధికారులు మరమ్మతులు చేపట్టేందుకు ఆర్థో ఇంజినీరింగ్ కంపెనీని సంప్రదించారు. వారు వచ్చిన వెంటనే మరమ్మతులు చేపడతారని జెన్‌కో ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు.


