విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
అడ్డతీగల: విద్యార్థు లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు అన్నారు. విద్యాశాఖ, జిసీసీ అధికారులతో కలిసి శుక్రవారం అడ్డతీగల మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణను పరిశీలించారు. ఆహార పదార్థాల రుచిని చూశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎల్లవరంలోని డీఆర్ డిపోను పరిశీలించారు. రేషన్‌కార్డుదారులకు సరకుల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. సకాలంలో సక్రమంగా రేషన్‌ను పంపిణీ చేయాలన్నారు.


