హైరిస్క్ గర్భిణులకుసాధారణ ప్రసవం
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో హైరి స్క్ హైపరటెన్సన్ కలిగిన ఇద్దరు గర్భి ణులకు వైద్యులు, సిబ్బంది సాధారణ ప్రసవం చేశారు. గురువారం రాత్రి వనుగుపుట్టు, బొండ్రుగూడ గ్రామా లకు చెందిన గర్భిణులు అంజలి, మనిషా ప్రసవం నిమి త్తం ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ ఆదిత్య వారిని పరీక్షించగా.. ఇద్దరు కూడా హైరిస్క్ హైపరటెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ సిబ్బంది సహకారంతో ఇద్దరు గర్భిణులకు సాధారణ ప్రసవం చేశారు. వైద్యుడు ఆదిత్య, సిబ్బంది రాంబాబు, శ్యామ్, నూకాలమ్మ, సుబ్బలక్ష్మీలకు గర్భిణులకు చెందిన కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


