మెరుగైన వైద్యం అందించాలి
● జిల్లా టీబీ పర్యవేక్షణాధికారి డాక్టర్ కిరణ్‌కుమార్
● వైద్య సిబ్బందికి సూచనలు
రాజవొమ్మంగి: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ పర్యవేక్షణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతివార్డులో గల సదుపాయాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పరిశుభ్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ల్యాబ్‌ను పరిశీలించారు. క్షయ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు పరీక్షలు చేసి ఆయా వివరాలను వెబ్‌పోర్టర్‌లో అప్‌లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం మండలంలోని శరభవరం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఎంఎల్‌హెచ్‌పీ, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
కొయ్యూరు: క్షయ పరీక్షల సంఖ్యను పెంచాలని జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి(డీపీఎంవో, డిలాట్) డాక్టర్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని రాజేంద్రపాలెం ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం బర్త్ వెయింటింగ్ హాలును సందర్శించి గర్భిణులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలిచ్చారు. కుష్టు సర్వే నిర్వహించి, రోగుల వివరాలను సంబంధిత వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. వైద్యుడు నాయక్‌తో మాట్లాడారు. గర్భిణులను ప్రసవానికి వారం ముందగా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. సిబ్బంది నాగేశ్వరరావు, రెహమాన్, రామరాజు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి


