ఇల్లు లేని వారితో దరఖాస్తు చేయించండి
అరకులోయ టౌన్: ఇల్లు లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తు చేయించాలని హౌసింగ్ పీడీ బాబునాయక్‌ను స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. గురువారం ఆయన ఎమ్మెల్యేన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో మంజూరైన గృహాలు పరిస్థితిని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గానికి పీఎంఏవై పథకంలో సుమారు 33వేల ఇళ్లు మంజూరైనట్లు పీడీ వివరించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈఈ రాజుబాబు ఉన్నారు.
అందరికీ ధన్యవాదాలు
అరకుఅసెంబ్లీ నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత జగన్‌మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జిల్లా, మండల, పంచాయతీ స్థాయి నేతలు, పార్టీ శ్రేణులకు రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో 53వేల సంతకాల సేకరించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అన్నారు.
హౌసింగ్ పీడీకి
ఎమ్మెల్యే మత్స్యలింగం ఆదేశం


