11,12 తేదీల్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు
● సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిపొట్టిక సత్యనారాయణ
పాడేరు రూరల్: పాడేరు కేంద్రంగా ఈనెల 11,12 తేదీల్లో రెండు రోజులపాటు సీపీఐ జిల్లా కౌన్సిల్ సమవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలు, ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణతో పాటు భవిషత్తు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు. పార్టీ శ్రేణులు,ఆదివాసీ ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని వియజవంతం చేయాలని ఆయన కోరారు.


