స్వయం సహాయకసంఘాలకు చెక్కుల పంపిణీ
పాడేరు : గ్రామ స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో చింతపల్లి మండలానికి చెందిన గ్రామ స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు ద్వారా రూ.3కోట్ల 35లక్షల రుణాల చెక్కులను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జీ ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ మురళి పాల్గొన్నారు.


