పాడేరు వైద్య కళాశాలకు పూర్తి సహకారం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల భవిష్యత్తులో నంబర్ వన్‌గా నిలుస్తుందని, ఆంధ్ర వైద్య కళాశాల మెంటరింగ్ సంస్థగా పూర్తి సహకారం అందిస్తుందని ఆ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థుల ప్రెసర్స్‌డేను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆమె మాట్లాడారు. వైద్య విద్య పొందుతున్న విద్యార్థులంతా బాధ్యతగా చదువుకోవాలని సూచించారు. వైద్య విద్యకు సమాజంలో ఉన్నత స్థానం ఉందని, అందుకు తగ్గట్టుగా మంచి సంకల్పాన్ని వైద్య విద్యార్థులు నిర్మించుకోవాలన్నారు. దేశంలో అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా వైద్య విద్యలో ప్రవేశాలు పొందారని, తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగానే క్రమశిక్షణతో కూడిన విద్య పొందాలని పిలుపునిచ్చారు. పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి మాట్లాడుతూ వైద్య విద్యార్థులంతా చదువుతో పాటు మానవత్వం, నైతిక విలువలు, సేవాభావం, కరుణ అలవర్చుకోవాలన్నారు. ర్యాగింగ్‌కు తావులేని వాతావరణం ఉండాలన్నారు. అనంతరం వైద్య విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పాపారత్నం,పా డేరు జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ తమర్భ నరసింగరావు, పలు విభాగాల వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో నంబర్ వన్ స్థాయికి..
ఏంఎసీ ప్రిన్సిపాల్ కేవీఎస్‌ఎం
సంధ్యాదేవి
ఘనంగా ఫ్రెషర్స్ డే
ఆటపాటలతో సందడి చేసిన
వైద్య విద్యార్థులు
పాడేరు వైద్య కళాశాలకు పూర్తి సహకారం


