పునరావాసానికి మూడు అవకాశాలు
మిగతా 8వ పేజీలో
చింతూరు పీవో శుభం నొఖ్వాల్
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసితులవుతున్న చింతూరుకు చెందిన గిరిజనేతర కుటుంబాలకు పునరావాసం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం మూడు ఆప్షన్లు కల్పిస్తున్నట్లు స్థానిక ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి శుభం నొఖ్వాల్ తెలిపారు. గిరిజనేతర నిర్వాసితుల నుంచి అభిప్రాయాలు సేకరించే నిమిత్తం శుక్రవారం చింతూరులో ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరుకు చెందిన 1,778 మంది గిరిజనేతర నిర్వాసితులకోసం ఏలూరు జిల్లా తాడ్వాయిలో స్థల సేకరణ జరిపామన్నారు. వీరికి అక్కడ పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. మొదటి ఆప్షన్‌గా ప్రభుత్వం ఐదుసెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తుందని, రెండో ఆప్షన్‌గా ఐదుసెంట్ల స్థలం తీసుకుని ఇల్లు వద్దనుకుంటే రూ 2.85 లక్షలు ఇస్తుందని, మూడో ఆప్షన్‌గా స్థలం, ఇల్లు వద్దనుకుంటే స్థలానికి రూ. లక్ష, ఇంటికి రూ 2.85 లక్షలు మొత్తం రూ 3.85 లక్షలు ఒన్‌టైం సెటిల్‌మెంట్‌గా చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ పరిహారం రూ 6.36 లక్షలతో కలిపి ఈ సొమ్ములను కూడా నిర్వాసితుల ఖాతాల్లో జమచేయబడతాయని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకుని సమ్మతి తెలుపుతూ పత్రాలు అందచేయాలని ఆయన సూచించారు. అర్హత ఉండి ప్రస్తుత ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో పేర్లులేని నిర్వాసితులను రెండో విడత జాబితా లో చేర్చి పరిహారం, పునరావాసం కల్పిస్తామని పీవో తెలిపారు. అధికశాతం మంది తాడువాయి


